My Writings‎ > ‎

ఒక SOFTWARE ENGINEER కి వచ్చిన జన్మ దిన కానుక

posted Mar 18, 2008, 12:23 PM by Pradeep Miriyala   [ updated Sep 8, 2008, 3:13 PM ]

నా ఫోన్ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ మోగుతోంది

సమయం ౧౨ గంటలు

అది కచ్చితంగా నా ONSITE COORDINATOR నుంచే అయి ఉండాలి కాని ఫోన్ చేసినది నా కాబోయే భార్య



కానీ నేను ఎక్కడ ఉన్నాను, ఇంకా ఆఫీస్ లోనే ఉన్నా, మా CLIENT పంపిన BUGS పరిష్కరిస్తూ ఉన్నా

ఒక్కసారి నా ఆలోచనలు నా బాల్యం లోకి తొంగి చూసాయి

చిన్నప్పుడు నిద్ర పోనని గోల చేస్తే, "నిద్ర పోకపోతే నిశాచరుడువి అవుతావు" అన్న అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి . నేను నా పిల్లలకు నన్ను నేను ఉదాహరణగా చెప్తే చాలు, కథలు అవసరం లేదు.

ఒక్క సారి నా మీద నాకే జాలి కలిగింది, నా మెదడు నా మనసుతో సంభందం లేకుండా పని చేసుకు పోతుంటే



ఒక్క సారి చుట్టూ చూసా, ఒక్క పురుగు కూడా లేదు పరిసరాలలో

అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? , అందరూ త్వరగా ఎప్పటి లానే వెళ్ళిపోతే
నేను కూడా త్వరగానే బయలు దేరాను కానీ భాద్యత అన్నది నా ముందరి కాళ్ళకు బందంలా తయారు అయ్యింది!!!
అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటే
అప్పుడు సమయం ఆరు గంటలు, బయలు దేరబోతూ మా CLIENT పంపిన BUG చూసా, ఇంకేమి మెదడు నా మాట వింటే కదా ఒక్క గంటలో పంపించా ఆరోగ్య వంతమైన SOFTWARE
కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా, మా ONSITE COORDINATOR ఫోన్ చేసి ఏదో కొత్త requirement ఉంది అన్నాడు, మనం ఆగుతామా ఇంక మొదలు పెట్టాను పని
అదీ అలా ఒంటరిగా మిగిలి పొయా!!!‌

నేను ఆలొచిస్తున్న సంగతి నా ఫొనెకేం తెలుసు, అది మోగుతూనే ఉంది
ఇంక చిరాగ్గా ఫోన్ ఎత్తా, నా కోపం అంతా పాపం నా కాబోయే భార్యపై చూపించా
నా వేడి తగ్గాక తను అంది " జన్మ దిన శుభాకాంక్షలు " , ఒక్క సారి నా కోపమ్ దిగిపోయింది
కాసేపు మట్లాడి ఫోన్ పెట్టేసి నా పని పూర్తి చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయా

తర్వాతి రోజు అంటే నా పుట్టిన రోజు నాడు పొద్దున్నే MAIL చూసా , MAIL విషయం ఏమిటి అంటే















"THEY DONT WANT THE UPDATES DONE LAST NIGHT"
అబ్బ ఎంత గొప్ప బహుమతి

NOTE: SOME ENGLISH WORDS used for convinience and the incident is real except the fictitious parts of FIANCEE and BIRTHDAY

Comments