My Writings‎ > ‎

నదీ తీరాన నగర మధ్యన

posted Mar 18, 2008, 12:17 PM by Pradeep Miriyala   [ updated Sep 8, 2008, 3:12 PM ]

నదీ తీరాన నగర మధ్యన

గురి చూసి సంధించాడు మన్మధుడు తన బాణాన్ని..

ఆ మోహ పారవశ్యంలో మునిగిన ప్రేమికుల అధర చుంబన ద్రుశ్యాలెన్నో,

ఇక వెచ్చని కౌగిలింతల లెక్కే లేదు…

ఆ బాణమే, ఈఫిల్ టవర్ , ఆ నగరం పారిస్

అసలు పారిస్ అనగానే గుర్తుకు వచ్చే కట్టడం ఈఫిల్ టవర్ అంటే అతిశయోక్తి లేదేమో!!!

 

అయితే పారిస్ లో ఉన్న అసలైన అద్భుతం laa veenus de milo museum

జీసస్ రుధిర చాయా చిత్రాలు ఒక వైపు
సుకుమార వనితల శృంగార చిత్రాలు ఒక వైపు
మహా యోధుల వీర చిత్రాలు మరొక వైపు
మాతృత్వ మాధుర్యాన్ని పంచే మధుర చిత్రాలు ఇంకొక వైపు…

ఇన్ని భావాలను తన నగు మోములో చుపించే మొనాలిసా ఆ మ్యూజియంకే తల మానికం

 

ఇంకా పారిస్ లో నన్ను ఆకర్షించిన కట్టడం ఒపెరా
అది రాజ భవన ప్రాకారమో లేక పురాతన కళా మందిరమో

Comments