"మాతృభాష మధురం, మరి పరాయి భాష? ఘాటుగానా లేక కమ్మగానా ఉండేది?" కమ్మగానే ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు వెళ్ళింది laptop కొనటానికి కాబట్టి ఆ సమస్య ఉండదనే ఆశతో వెళ్ళాము. కానీ జర్మన్ల మాతృభాషా మమకారం ఎలా ఉందంటే వాళ్ళకు పూర్తిగా వేరే keyboard layouts and software అనే ప్రపంచం ఉంది (నిజానికి యూరోపియన్ దేశాలన్నీ ఇంతే). అదికార కేంద్రాల సమరం: రాజు (manager) చెయ్యాల్సిన పని మంత్రే (tech lead) చేస్తానంటే, మంత్రి చెయ్యాల్సిన పని కూడా రాజు చేస్తానంటే ఆ రాజ్యం పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా గందరగోళమే, రాజ్య సభలో సహాయ మంత్రులెవరికీ (engineers) ఏమి చెయ్యాలో అర్ధం కాదు. అలాంటి గందరగోళ పరిస్థితిలో ఎవరి పక్షాన నిలవాలి, తెలివి వైపు నిలవాలో అదికారం వైపు నిలవాలో తెలియని స్థితి. ఒకడేమో చెయ్యమంటాడు, ఇంకోడు ఎందుకు చేసావంటాడు. ఏమి చేస్తాం, అధికారం వైపు నిలుస్తూ తెలివికి చేయూతనివ్వడం తప్ప. (ఈ పది వారాలు ముగిసే సరికి, ఆ మంత్రి రాజీనామా చేసి వెల్లిపోయాడు, అది వేరే సంగతి) ఆకర్షణీయ నగరం పారిస్: "మనిసన్నాక కూసింత కళా పోషణ కూడా ఉండాలి" అన్నారు కదా, ఆ స్కీములో పారిస్ వెళ్ళాము. పారిస్ అనగానే అంతకుముందే వెళ్ళిన మా బన్నీ మరియు సత్తి గారి సలహాలు విని ముందుగా "Tom Hanks నటించిన The Davinci Code" చిత్రరాజం చూసాను. చూసాక ఈ మ్యూజియం చూసి తీరవలసిందే అని గట్టిగా తీర్మానించుకుని మరీ బయలుదేరాను. పారిస్ అంటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది ఈఫిల్ టవర్. దాన్ని కట్టడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేకపోయినా దానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ అలాంటిది. అందుకే ఆ ఈఫిల్ టవర్ ని చూడగానే నాకు "నదీ తీరాన నగర మధ్యన గురి చూసి సంధించాడు మన్మధుడు తన బాణాన్ని" అనిపించింది (access origianl post here). కానీ నిజానికి ఈఫిల్ టవర్ కేవలం ఆ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించటానికే కానీ పారిస్ లో చూడవలసిన విశేషాలు చాలా ఉన్నాయని, ఈఫిల్ టవర్ కోసం మూడు గంటలు వృధా చేయబోతున్నామని తెలియకనే పారిస్ నగారాన్నిశనివారం ఉదయానికి చేరాము. నగరం చూడటానికి మధ్యాహ్నం బయలుదేరాము. బయలుదేరి ఒపెరా ఇంటిని చూసి, ఈఫిల్ టవర్ వద్దకు చేరాము. ఈఫిల్ టవర్ కి మొత్తము రెండు అంతస్తులట, సరే అని పైకే ఎక్కాము. పైకి వెళ్ళాక దారి తప్పి మా ఊరి శివరాత్రి ఉత్సవాలకు వచ్చానా అని సందేహం వచ్చింది. సుమారు పది అడుగుల వెడల్పుతో ఉన్న ప్రదేశం అది. అంత చిన్న ప్రదేశంలో సుమారు రెండు వందల మంది ఆ ప్రదేశంలో తమ సాయంత్రాన్ని ఆనందించాలని ఆత్రుత పడుతున్నారు. ఇక కొత్తగా వచ్కిన వారికి నుంచునే స్థలం కూడా లేకుండా!!!. ఎలాగో కాసేపు ఉండి, ఇక ఉండలేక దిగి హోటలుకి వెళ్ళి నిద్రపోయాము. ఆదివారం ఉదయాన్నే బయలుదేరి మ్యూజియంకి వెళ్ళాము (ప్రతీ నెలా మొదటి ఆదివారం మ్యూజియంకి ఉచితప్రవేశం). కానీ మాకు ఉన్నది కేవలం మూడు గంటలు, మూడు రోజులు పట్టే మ్యూజియాన్ని తెలుగు సినిమాని అరగంటలో చూసినట్టు చూద్దామని విఫల ప్రయత్నం చేసాము. కానీ కనీసం సగం కూడా చూడలేకపోయాము. అందుకే నాకు అనిపిస్తుంది "కాలమనే రక్కసిని ఓడించాలని ప్రయత్నించా చివరకు నేనే ఓడిపోయా" అని. కనీసం పారిస్ లో ఉన్న మ్యూజియముల కోసమైనా మరోసారి పారిస్ వెళ్ళాలి, కానీ ఎప్పుడు ఆ అదృష్టం!!!. అలా మా పారిస్ యాత్ర ముగిసింది. మళ్ళీ వచ్చే జాబులో మరిన్ని విశేషాలు (మంచులో నడక...తిరుగు ప్రయాణ విశేషాలు) |
My Writings >