My writings section is being discontinued on this page and for my writings .. plz visit http://pradeepblog.miriyala.in |
My Writings
తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 2
"మాతృభాష మధురం, మరి పరాయి భాష? ఘాటుగానా లేక కమ్మగానా ఉండేది?" కమ్మగానే ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు వెళ్ళింది laptop కొనటానికి కాబట్టి ఆ సమస్య ఉండదనే ఆశతో వెళ్ళాము. కానీ జర్మన్ల మాతృభాషా మమకారం ఎలా ఉందంటే వాళ్ళకు పూర్తిగా వేరే keyboard layouts and software అనే ప్రపంచం ఉంది (నిజానికి యూరోపియన్ దేశాలన్నీ ఇంతే). అదికార కేంద్రాల సమరం: రాజు (manager) చెయ్యాల్సిన పని మంత్రే (tech lead) చేస్తానంటే, మంత్రి చెయ్యాల్సిన పని కూడా రాజు చేస్తానంటే ఆ రాజ్యం పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా గందరగోళమే, రాజ్య సభలో సహాయ మంత్రులెవరికీ (engineers) ఏమి చెయ్యాలో అర్ధం కాదు. అలాంటి గందరగోళ పరిస్థితిలో ఎవరి పక్షాన నిలవాలి, తెలివి వైపు నిలవాలో అదికారం వైపు నిలవాలో తెలియని స్థితి. ఒకడేమో చెయ్యమంటాడు, ఇంకోడు ఎందుకు చేసావంటాడు. ఏమి చేస్తాం, అధికారం వైపు నిలుస్తూ తెలివికి చేయూతనివ్వడం తప్ప. (ఈ పది వారాలు ముగిసే సరికి, ఆ మంత్రి రాజీనామా చేసి వెల్లిపోయాడు, అది వేరే సంగతి) ఆకర్షణీయ నగరం పారిస్: "మనిసన్నాక కూసింత కళా పోషణ కూడా ఉండాలి" అన్నారు కదా, ఆ స్కీములో పారిస్ వెళ్ళాము. పారిస్ అనగానే అంతకుముందే వెళ్ళిన మా బన్నీ మరియు సత్తి గారి సలహాలు విని ముందుగా "Tom Hanks నటించిన The Davinci Code" చిత్రరాజం చూసాను. చూసాక ఈ మ్యూజియం చూసి తీరవలసిందే అని గట్టిగా తీర్మానించుకుని మరీ బయలుదేరాను. పారిస్ అంటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది ఈఫిల్ టవర్. దాన్ని కట్టడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేకపోయినా దానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ అలాంటిది. అందుకే ఆ ఈఫిల్ టవర్ ని చూడగానే నాకు "నదీ తీరాన నగర మధ్యన గురి చూసి సంధించాడు మన్మధుడు తన బాణాన్ని" అనిపించింది (access origianl post here). కానీ నిజానికి ఈఫిల్ టవర్ కేవలం ఆ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించటానికే కానీ పారిస్ లో చూడవలసిన విశేషాలు చాలా ఉన్నాయని, ఈఫిల్ టవర్ కోసం మూడు గంటలు వృధా చేయబోతున్నామని తెలియకనే పారిస్ నగారాన్నిశనివారం ఉదయానికి చేరాము. నగరం చూడటానికి మధ్యాహ్నం బయలుదేరాము. బయలుదేరి ఒపెరా ఇంటిని చూసి, ఈఫిల్ టవర్ వద్దకు చేరాము. ఈఫిల్ టవర్ కి మొత్తము రెండు అంతస్తులట, సరే అని పైకే ఎక్కాము. పైకి వెళ్ళాక దారి తప్పి మా ఊరి శివరాత్రి ఉత్సవాలకు వచ్చానా అని సందేహం వచ్చింది. సుమారు పది అడుగుల వెడల్పుతో ఉన్న ప్రదేశం అది. అంత చిన్న ప్రదేశంలో సుమారు రెండు వందల మంది ఆ ప్రదేశంలో తమ సాయంత్రాన్ని ఆనందించాలని ఆత్రుత పడుతున్నారు. ఇక కొత్తగా వచ్కిన వారికి నుంచునే స్థలం కూడా లేకుండా!!!. ఎలాగో కాసేపు ఉండి, ఇక ఉండలేక దిగి హోటలుకి వెళ్ళి నిద్రపోయాము. ఆదివారం ఉదయాన్నే బయలుదేరి మ్యూజియంకి వెళ్ళాము (ప్రతీ నెలా మొదటి ఆదివారం మ్యూజియంకి ఉచితప్రవేశం). కానీ మాకు ఉన్నది కేవలం మూడు గంటలు, మూడు రోజులు పట్టే మ్యూజియాన్ని తెలుగు సినిమాని అరగంటలో చూసినట్టు చూద్దామని విఫల ప్రయత్నం చేసాము. కానీ కనీసం సగం కూడా చూడలేకపోయాము. అందుకే నాకు అనిపిస్తుంది "కాలమనే రక్కసిని ఓడించాలని ప్రయత్నించా చివరకు నేనే ఓడిపోయా" అని. కనీసం పారిస్ లో ఉన్న మ్యూజియముల కోసమైనా మరోసారి పారిస్ వెళ్ళాలి, కానీ ఎప్పుడు ఆ అదృష్టం!!!. అలా మా పారిస్ యాత్ర ముగిసింది. మళ్ళీ వచ్చే జాబులో మరిన్ని విశేషాలు (మంచులో నడక...తిరుగు ప్రయాణ విశేషాలు) |
తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 1
"పనులు చేస్తుంటే పరిచయాలు అవే అవుతాయి" అని మన్మధుడులో త్రివిక్రముడు డైలాగ్ రాసినా ఇలాంటివి వెండితెరపైనే జరిగేది అని కొట్టిపారేసిన నాకు, కళ్ళు తెరిపించింది జర్మనీ ప్రయాణం. సమయం రాత్రి ఎనిమిది గంటలు, ఇంకో నాలుగు గంటల్లో నా మొదటి విమాన ప్రయాణం. సిన్మాలు చూసిచూసి ఎయిర్ పోర్ట్ అంటే ఒక అధ్బుత ప్రయాణశాలగాను, విమానమంటే సకల సౌకర్యాల వాహనంగా ఊహించుకున్న నాకు బేగంపేట ఎయిర్ పోర్ట్ మరియు సదరు లుఫ్తాన్సావారు కళ్ళు తెరిపించారు. పన్నెండు కిలోమీటర్ల ఎత్తులో సైతం స్పీడ్ బ్రేకరులు ఉంటాయని (అదే మేఘాల తాకిడి అన్నమాట), ఎకానమీ విమాన ప్రయాణం అంటే సగటు భారతీయ గ్రామ రహదారిపై స్కూటరుపై వెళ్ళడంతో సమానమనీ తెలుసుకునేసరికి -50C బయటి ఉష్ణోగ్రతలో, తప్పించుకోలేనంత ఎత్తులో నిస్సహాయ స్థితిలోనికి నెట్టబడ్డాను. ఇక చేసేదేమి లేక ఇంకా మిగిలి ఉన్న 8 గంటల ప్రయాణాన్ని తలచుకుని నిద్రకు ఉపక్రమించాను. నిద్ర లేచే సరికి జర్మనీ వస్తుందన్న వెర్రి ఆశతో!!!. దేవుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర పోయే వరం ఇవ్వలేదన్న సంగతి ఒక అరగంటలోనే తెలిసిపోయింది. చేసేది లేక వెర్రి చూపులు చూస్తూ లుఫ్తాన్సా సమర్పించిన "Tararampam" అనే చిత్ర రాజం చూసాను యుద్దఖైదీ లాగ... నిద్ర రాకపోతే పుస్తకం చదవమన్నారు, ఒక పుస్తకమైనా తెచ్చుకోలేదు అనుకుంటూ, నన్ను నేనే తిట్టుకుంటూ క్షణాలు లెక్కిస్తూ కూర్చున్నా.. నా నిరీక్షణ ఫలించింది, నా మొదటి మజిలీ వచ్చింది. ఒక గంట విరామం తర్వాత మరో విమానం ఎక్కి నా "final destination" ని చేర్చే రెండవ మజిలీకి చేరాను. ఈ సారి కేవలం గంట సేపే ప్రయాణం, హమ్మయ్య అనుకున్నానో లేదో, మా లగేజ్ రాలేదన్న సంగతి తెలిసింది... ఎంత తిట్టుకున్నా తప్పదు కదా, లుఫ్తాన్సా వారికి ఫిర్యాదు చేస్తే, సాయంత్రానికి మీ అడ్రస్సుకు పంపుతాం అన్నారు. పోనిలే ఈ మాత్రం భరోసా ఇచ్చాడు అనుకుని ముచ్చటగా మూడవ మజిలీ ప్రారంభించాను. ఈసారి ట్రైన్ పై, యూరప్ ట్రైన్స్ అంటే, బుల్లెట్ ట్రైన్స్ అనుకుంటున్న నాకు, తక్కువ దూరాలకు అవి అందుబాటులో ఉండవని తెలిసిన తర్వాత ఒక చిన్న నిట్టూర్పు విడవడం తప్ప చేసేదేమీ లేక గాలి లోపలికి రాలేని ట్రైన్ ఎక్కి మొత్తానికి గమ్యాన్ని చేరాను. ఒక రోజు విశ్రాంతి తర్వాత మా క్లయింటు వారి కార్యాలయమునకు చేరాము. మేమున్న ఇంటి నుంచి కార్యాలమునకు రెండు కిలోమీటర్లే అయినప్పటికీ, మా రూటులో బస్సులు లేక అప్పుడెప్పుడో కళాశాల రోజుల్లో వదిలేసిన నడకను ప్రారంభించాను. అయితే అయింది కానీ నా మంచికే అని సంతోషించాను. కార్యాలమునకు చేరిన తర్వాత, మా onsite coordinator పులి ముందు జింక పిల్లను వదిలేసినట్టు, నన్ను మా మానేజరు దగ్గర వదిలేసి జారుకున్నాడు. కనీసం నీ పేరేమిటి అని కూడా అడగకుంటా, రెండు డబ్బాలు చూపించి మీ గణన యంత్రాలు (అదే computer) సిద్దం చేసుకోండి అన్నాడు. సరేలే ఇంక చేసేదేముంది అని మా డబ్బాలు తెరిచి మొత్తం సిద్దం చేసుకున్నాం. (ఒక రకంగా మన పని మనమే చేసుకోవడం కూడా మంచిదే కదా) . అలా, మొదటి వారమంతా లాబ్ ని సిద్దం చేసుకోవడంతోనో లేక మా పని స్థలాన్ని తయారు చేసుకోవడంతోనో సరిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, ఇండియాలో వదిలేసిన ఒళ్ళు వంచటం అనే మంచి పని తిరిగి మొదలయ్యింది. కళాశాల రోజుల్లో నాలో ఉన్న శారీరక క్రమశిక్షణ తిరిగి వచ్చింది. కానీ చిరాకు మొదలయ్యింది, ఇందుకేనా IT Engineer హోదాలో!!! వచ్చింది అని. రెండు వారాల నిరీక్షణ తర్వాత నేను నా German laptop (సమయాన్ని వ్యర్ధం చేసే మంచి స్నేహితుడు) కొన్న తర్వాత నేను ఎందుకు వచ్చానో ఆ పని మొదలయ్యింది. ఆఫీసులో ఇలాంటి విచిత్రమైన్ అనుభవాల మద్య, ఇంకో కొత్త అనుభవం వంట చెయ్యడం!!, అసలే శాఖాహారిని కావడంతో బయట తినే సౌకర్యమూ లేకపోయె L . అప్పటి వరకు వంట ఎలా చెయ్యాలో అమ్మ చేసేడప్పుడు చూడడమే అన్న అనుభవంతోనే, వంట గదిలో ప్రవేశించాను. (థియరీ మాత్రమే తెలుసు, ప్రయోగాలు చెయ్యలేదు..ప్రయోగాల పరమార్ధం ఇప్పటికి తెలిసింది, ఎంతైనా ప్రయోగాలు నా మీదే కదా!!). ఎలాగో కష్టాలు పడి మొత్తానికి వంటలు చెయ్యడం మొదలు పెట్టాను. (మరో పది వారాలు... తరువాతి భాగంలో.. నా German laptop తో కష్టాలు, అధికార కేంద్రాల మద్య నలిగిపోవడం...ఆకర్షణీయమైన నగరం "పారిస్" విశేషాలు..మంచులో నడక..) |
మతం దేవుడిని స్రుష్టించిందా లేక దేవుడే మతాన్ని స్రుష్టించాడా?
అనగనగా భూమి అనే గ్రహం ఉండేది. ఎవరు పంపారో తెలియదు కానీ జీవరాశి ఉద్భవించింది. (ఇంకెవరు, దేవుడేనా?) మనసు నమ్మకమే ప్రధానం అంటుంది.. మెదడు ఆధారం ఏది అంటుంది ... ఇంకేం, దేవుడు ఉద్భవించాడు... మనసు కోసం... మెదడు, నమ్మలేదు ఆధారం కావాలంది. దేవుడిని చూపమంది.. మనసుకి మాత్రం తెలిస్తే కదా... మెదడునే తన మాట వినమని శాసించింది.. ఆధారాల కోసం ఆలయాలు నిర్మింపచేసింది.. మెదడు తక్కువ తిందా, ఆ ఆలయాలలో తను చూసిన విషయాలను నిఘూఢంగా భధ్ర పరిచింది ఎప్పటికైనా గెలవకపోతానా అని. మనసు మెదడు నిరంతరాయంగా పోట్లాడుకుంటూనే ఉండసాగాయి. యోగులకు ఆకర్షితులై మనసుని అదీనంలో ఉంచుకోలేనివారు మతాన్ని స్రుష్టించారు. అధికార దాహం పెరిగిన వారు మతాదిపతులై ప్రాంతాలను శాసించసాగారు. మెదడుని ఆధారాల కోసం వెతకవద్దన్నారు. శాస్త్రానికి ఆకర్షితులైన వారు, కొంగ్రొత్త విషయాలను ఆవిష్కరించసాగారు.. ఓటమిని ఓర్వలేని మనసు దేవునికే ధిక్కారమా అంటూ శాస్త్రవేత్తలను కించపరచింది. మెదడుపై సానుభూతో, నిజాలపై మక్కువో, శాస్త్రవేత్తల సంఖ్య పెరగసాగింది. శాస్త్రానికి ఆకర్షితులై మనసు చెప్పిన మాట వినే వాళ్ళ సంఖ్య పెరగసాగింది. సంఘం రెండు ముక్కలుగా చీలింది. ఆస్తిక వర్గం మరియు నాస్తిక వర్గం. ఆస్తిక వర్గంలో అంతర్గత తగదాలు మొదలయ్యాయి, మతాల సంఖ్య పెరగసాగింది. మత పరమైన నాస్తికులు పుట్టుకొచ్చారు. వర్గాలు పెరిగాయి. కలహాలు పెరిగాయి. ఇంత గొడవకు కారణమైన మర్రిగింజంత ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు, మనసుతో ఆలోచించినవాడు దేవుడు... అలాంటి దేవుళ్ళ అభిమాన సంఘాలే మతాలు. As a C++ programmer, GOD is void pointer who can be assigned to any religion. |
Google Sites and Apps - Review
Many of the netizens haven't heard of Google Apps. Some of them are aware of it. Google Apps is the best Application that helps to maintain your own domain. (You should have your own domain to use it). With Google Apps one can get
Advantages:
Disadvantages:
Competitors: As for my knowledge, Microsoft is the only competitor in similar application (Live Domains) which provides only mail and messenger at this moment.
What If one doesn't have own domain but want to use Google Apps???? With Google Apps Team edition, one can sign up with their school or company mail ID and start using Google Apps. You can't use your personal mail ID's for this purpose.
Google Apps although has some limitations, for a small business users and personal website owners it is very helpful. |
ఒక SOFTWARE ENGINEER కి వచ్చిన జన్మ దిన కానుక
నా ఫోన్ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ మోగుతోంది |
తప్పు ఎవరిది?
ఆగష్టు పదిహేను 2007 నా ఫోన్ లో ఏదో గేమ్ ఆడుకుంటున్న నాకు, నా వైపే ఎవరో తీక్షణంగా చూస్తున్నట్టు అనిపించింది చూస్తే స్కూల్ యూనిఫామ్ లో ఒక అబ్బాయి, నాకు సమీపంలో నుంచుని నన్నే గమనిస్తున్నాడు అది ఏదో షాపింగ్ కాంప్లెక్స్ అయితే నేను పట్టించుకునే వాడిని కాదు, కానీ నేను ఉన్నది నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో (చెన్నై నుంచి నిజాముద్దీన్ వెళ్తోంది, చెన్నై దాటి ఒక గంట అవుతోంది) సమయం చూస్తే ఉదయం పదకొండు గంటలు ఆ అబ్బాయిని చూడగానే నాకు ఏదో తేడాగా అనిపించింది, ఎందుకంటే ఊరు వెళ్తున్నవాళ్ళెవరూ సాధారణంగా స్కూల్ యూనిఫామ్ లో వెళ్ళరు కదా. చూడబొతే ఒక్కడే వెళ్తున్నట్టు ఉన్నాడు. పైగా నేను ఇదే ట్రైన్లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు వెళ్ళాలి (నేను ఒక్కడినే చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్నాను). సరేలే అని పలకరించా. ఆ అబ్బాయి పేరు మహేందర్, పదవ తరగతి చదువుతున్నాడు , హిందీ , ఆంగ్లం మాత్రమే వచ్చు (ఇంకా తమిళ్ నేర్చుకోలేదు) వాళ్ళ తల్లితండ్రులు ఉండేది పూణెలో ఇప్పుడు ఈ అబ్బాయి చెన్నైలో వాళ్ళ పెదనాన్న ఇంటిలో ఉండి చదువుకుంటున్నాడు గత రెండు నెలలుగా. నెమ్మదిగా తేలిన విషయం ఏమిటంటే వాడు పూణే వెళ్దామని బయలు దేరాడు, తల్లి తండ్రులను చూద్దామని, చేతిలో పైసా లేకుండా! పైగా ఈ ట్రైన్ పూణే వెళ్ళదు. వాడి పరిస్తితి చూస్తే నాకు గజరాజుని రక్షించడానికి పరిగెత్తుకు వచ్చిన విష్ణు మూర్తి గుర్తు రాలేదు, ఆవేశంలో ఏమయినా చేద్దామనుకునే యువ రక్తం కనిపించింది (నేనేమీ ముసలి వాడిని కానులెండి). తప్పు ఎవరిది? వాడిదా , వాడి తల్లితండ్రులదా ? నా లాగే వాడి పరిస్తితి గమనించిన మరో సాటి ప్రయాణికుడు వాడికి దారి ఖర్చుల కోసం ఒక వంద రూపాయలు ఇచ్చాడు. ఇంక అప్పటి వరకు బాగానే ఉన్న వాడు కాస్తా అమ్మతో మాట్లాడాలి అన్నాడు, సరేలే అని పూణే ఫోన్ చేసా. ఇంక అప్పుడు మొదలు అయ్యింది అసలు కధ, నా నంబర్ ఇచ్చా వాళ్ళకి, వాళ్ళ అమ్మానాన్న ఏమి చెప్పారో తెలియదు కానీ, వాడు చెన్నై వెనక్కి పోతా అన్నాడు, ఒక పక్క ట్రైన్ ఆగబోతోంది నెల్లూరులో. అప్పుడు వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి మీరు దయ చేసి వాడిని రక్షక భటులకు అప్పగించండి, మేము వచ్చి తీసుకువెళ్తాం అన్నారు. ట్రైన్ ఆగేది ఎంత సేపు చెప్పండి? వెంటనే TC దగ్గరకు వెళ్ళి పరిస్తితి చెప్పి సహాయం కోరా, “నేనేమి చెయ్యగలను, నాకేమి సంభందం, ఇది పోలీస్ ఇష్యూ” అన్నాడు (మహేందర్ దగ్గర టికెట్ లేదు, కనీసం ఆ వంకతో ఐనా పోలీసులకు అప్పగించవచ్చు) ఇంక నేను ఆ అబ్బాయిని పోలిసులకు అప్పగించాలనుకున్న ఆలోచన మార్చుకున్నా, తప్పు ఎవరిది? పైసా కూడా లేని ఈ అబ్బాయితో నాకేమి పని అనుకున్న TCదా, లేక TCని అడిగిన నాదా? కాసేపటికి ఆ అబ్బాయి తండ్రి మళ్ళీ ఫోన్ చేసాడు, విజయవాడ వరకు నాతో తీసుకువెళ్తా అని చెప్పాను. అసలే నా ఫోన్ సోనీ ఎరిక్సన్ కావడంతో బాటరీ అయిపొవచ్చింది, సరే అని స్విచ్ ఆఫ్ చేసా. ఒక గంట తర్వాత ఆన్ చేసి చూద్దును కదా, మహేందర్ అక్క చెన్నై నుంచి సందేశం పంపింది, మేము బయలు దేరుతున్నాం అని (ఈ గంటలో వాళ్ళ కుటుంబం నుంచి ఒక పది మిస్సుడు కాల్స్ ఉన్నాయి, ఎయిర్ టెల్ వారి సమాచారం ప్రకారం) , సమయం ఒంటి గంట. రైలులో దొరికే తిండి తిని కాసేపు మహేందర్ తో భాతాఖానీలో పడ్డా, గమ్యం ఏమిటి అన్న నా ప్రశ్నకు “ప్రస్తుతానికి ఏమీ లేదు, ఏదో ఒక మంచి ఉద్యోగం చెయ్యాలి” అన్నాడు. తప్పు ఎవరిది? భవిష్యత్తు మీద సరైన అవగాహన కల్పించని మన చదువులదా, లేక జీవితంలో విజయం అంటే ఉద్యోగమే అనే పరిస్తితి కల్పించిన సంఘానిదా? సరే, భవిష్యత్తులో ఏమి చదువుతావు అని అడిగా, ప్రతీ పది మందిలో ఎనమండుగురు చెప్పే సమధానమే వచ్చింది, ఇంజినీరింగ్ అని. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. తప్పు ఎవరిది? ఇంజినీర్సుకు మంచి జీతాలు ఇస్తూ అందరినీ తమ వైపు ఆకర్షిస్తున్న కంపనీలదా లేక రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని మనదా? ఆ తర్వాత మహేందర్ ఇంటి దగ్గర నుండి ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక కాల్, జాగ్రత్తగా చూసుకోమని, మాట వినకపోతే గొలుసుతో కట్టెయ్యమని. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి, మహేందర్ కు ఒక అక్క (ఫాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి ఉద్యోగం చేస్తోంది) , ఒక తమ్ముడు (UKG చదువుతున్నాడు) ఉన్నారు. దండన కన్నా ఆప్యాయతే త్వరగా జయిస్తుందని ఎప్పటికి అర్ధం చేసుకుంటారో సమయం మూడు గంటలు, ఇక్కడ మీకు నేను ముందుగా వేసుకున్న ప్రణాళిక చెప్పాలి, నా ప్రణాళిక ప్రకారం నేను విజయవాడలో నాలుగు గంటలకు ఈ ట్రైన్ దిగి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళే పాసింజర్ ని ఐదు గంటలకు అందుకోవాలి, అక్కడ నుంచి పిఠాపురం వెళ్ళాలి. కాబట్టి నేను ఈ అబ్బాయి కోసం ఆగకపోతే రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరుకుంటా. ఇంతలో మహేందర్ ఇంటి దగ్గర నుంచి ఫోన్, వాళ్ళ నాన్న ఏడవటం మొదలు పెట్టాడు, నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు, (వింత ఏమిటి అంటే వాళ్ళ అమ్మ అసలు భాదను బయటపెట్టకుండా నియత్రించుకుంటూ సంతోషంగా మాట్లాడటం) ఈ అబ్బాయిని విజయవాడ పోలిస్ స్టేషన్ లో వదిలి వేద్దామంటే అది అంత మంచి పనిలా కనిపించలేదు, పోనీ ఆ అబ్బాయిని వాడి మానాన వదిలి వేద్దామా అంటే అది కూడా మంచి పని అనిపించలేదు. ఇంతలో వాళ్ళ పెదనాన్న చెన్నై నుంచి ఫోన్, బయలు దేరాము, దారిలో ఉన్నాము అని. వాళ్ళు ఎంత వేగంగా వచ్చినా 420km రెండు గంటలలో రావడం అసాధ్యం. విజయవాడలో ఉన్న నా సన్నిహితులకు ఫోన్ చేసా, ఎవరికైనా వీలైతే వాళ్ళకు ఈ అబ్బాయిని అప్పగించి నేను బయలుదేరాలి అని, కానీ ఎవరూ ఆ రోజు విజయవాడలో లేరు. ఇంక ఒక నిర్ణయం తీసుకున్నాను, మహేందర్ ని వాళ్ళ బందువులకు అప్పగించాకే నేను బయలుదేరాలి అని. మొత్తానికి ఒక మూడు గంటలు విజయవాడలో వేచిచూసాకా, మహేందర్ బందువులు వచ్చారు. వాళ్ళకు మహేందర్ ని అప్పగించి నేను బస్ లో మా ఇంటికి బయలు దేరాను. పదకొండు గంటలకు ఇంటికి చేరాల్సిన నేను కొంచెం ఆలస్యంగా, తెల్లవారుఝామున మూడు గంటలకు ఇంటికి చేరాను, ఒక మంచి పని చేసిన త్రుప్తితో నిద్ర పోయా, మరుసటి రోజు ఉదయం మహేందర్ వాళ్ళ నాన్న ఫోన్ చేసారు, ఏమైనా కారణం చెప్పాడా, ఇలా పారిపోవడానికి అని, “మిమ్మల్ని మిస్ అవుతున్నాడు “అని చెప్పా, దానికి ఆయన “వాడికి పుణేలొ ఉన్న స్నేహితులు హితులు కారు, అందుకే చెన్నై పంపాను” అన్నారు. తప్పు ఎవరిది? కొడుకుని ప్రేమతో పాలించలేకపోయిన తండ్రిదా, లేక తన స్నేహితులను సరిగ్గా ఎన్నుకోలేకపోయిన కొడుకుదా? తప్పు ఎవరిది? ఇంటి మీద బెంగ పెట్టుకున్న కొడుకుదా, లేక కొడుకు బాగా చదువుకోవాలని దూరంగా వుంచి చదివిస్తున్న తల్లిదండ్రులదా? |
నదీ తీరాన నగర మధ్యన
నదీ తీరాన నగర మధ్యన
గురి చూసి సంధించాడు మన్మధుడు తన బాణాన్ని.. ఆ మోహ పారవశ్యంలో మునిగిన ప్రేమికుల అధర చుంబన ద్రుశ్యాలెన్నో, ఇక వెచ్చని కౌగిలింతల లెక్కే లేదు… ఆ బాణమే, ఈఫిల్ టవర్ , ఆ నగరం పారిస్ అసలు పారిస్ అనగానే గుర్తుకు వచ్చే కట్టడం ఈఫిల్ టవర్ అంటే అతిశయోక్తి లేదేమో!!!
అయితే పారిస్ లో ఉన్న అసలైన అద్భుతం laa veenus de milo museum జీసస్ రుధిర చాయా చిత్రాలు ఒక వైపు ఇన్ని భావాలను తన నగు మోములో చుపించే మొనాలిసా ఆ మ్యూజియంకే తల మానికం
ఇంకా పారిస్ లో నన్ను ఆకర్షించిన కట్టడం ఒపెరా |